కేటీఆర్‌.. వరద సాయం ఎప్పుడిస్తారు: దాసోజు

తాజా వార్తలు

Published : 18/07/2021 17:21 IST

కేటీఆర్‌.. వరద సాయం ఎప్పుడిస్తారు: దాసోజు

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వరద సాయాన్ని వెంటనే విడుదల చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామన్న వరద సాయం ఏ కారణం చేత ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. 2020 అక్టోబరు నాటి వరద బాధితులు దాదాపు 5 లక్షల మంది పరిహారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు రూ.200 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారన్నారు. ఈ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలన్నారు. నాలాల వెడల్పు, స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్‌ని ప్రారంభించి వరద కష్టాల నుంచి హైదరాబాద్‌ ప్రజలను ఎప్పుడు కాపాడుతారని కేటీఆర్‌ను నిలదీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని