AP News: కడప నుంచి ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టండి: జగన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

Updated : 10/10/2021 17:07 IST

AP News: కడప నుంచి ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టండి: జగన్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీ సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. అందరికీ విమానయానం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్‌’ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్య విమాన సర్వీసులుఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవన్నారు. 

గతంలో కడప నుంచి హైదరాబాద్, విజయవాడకు విమాన ప్రయాణం చేయాలంటే ప్రజలు తిరుపతి, చెన్నై, బెంగుళూరు వెళ్లాల్సి వచ్చేదని.. దీని వల్ల సమయం వృథాతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉండేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2018లో తెదేపా ప్రభుత్వం కడప నుంచి దేశంలోని వివిధ ప్రదేశాలకు విమాన సేవలను ప్రవేశపెట్టిందని.. దీంతో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల ప్రజలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులను సద్వినియోగం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేశారని.. దీంతో పెట్టుబడిదారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కడప, ఇతర ముఖ్య పట్టణాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కడప, ఇతర ప్రాంతాల ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని