AP News: వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి: బొండా ఉమ 

తాజా వార్తలు

Updated : 22/09/2021 11:42 IST

AP News: వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి: బొండా ఉమ 

విజయవాడ: ఏపీలోని పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలిసే రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా జరుగుతోందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. డ్రగ్స్‌ దందాపై విచారణ జరిపించాలని డీఆర్‌ఐకి లేఖ రాస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారు. డ్రగ్స్‌ దందాలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలి. వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి.

హఠాత్తుగా నిన్న మంత్రి పేర్ని నాని ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారు. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకుంటారెందుకు?రూ.9 వేల కోట్ల హెరాయిన్‌ పట్టుబడటం దేశంలో ఎప్పుడూ జరగలేదు. దేశంలోకి వచ్చిన రూ.70వేల కోట్ల హెరాయిన్‌ ఎక్కడికి వెళ్లింది. ఏపీ పోలీసులు ఎందుకు విచారణ చేయట్లేదు?పెద్ద ఎత్తున దందా జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారు’’ అని బొండా ఉమ ప్రశ్నించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని