TDP: అప్పుడు వైఎస్‌ఆర్‌.. ఇప్పుడు జగన్‌ సీమకు అన్యాయం చేస్తున్నారు: తెదేపా

తాజా వార్తలు

Published : 25/09/2021 01:23 IST

TDP: అప్పుడు వైఎస్‌ఆర్‌.. ఇప్పుడు జగన్‌ సీమకు అన్యాయం చేస్తున్నారు: తెదేపా

కడప: రాయలసీమకు నీటి వాటాలు దక్కకుండా ఈ ప్రాంతంలో రైతులు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా నేతలు విమర్శించారు. కడపలోని మాధవి కన్వెన్షన్‌లో రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వెలిగొండ, గాలేరునగరి, హంద్రీనీవాలకు కృష్ణా నీటి వాటా హక్కులను వదులుకుంటామని 2006లోనే రాజశేఖర్‌రెడ్డి.. కృష్ణా ట్రైబ్యునల్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీఎం జగన్‌ లాలూచీ రాజకీయాలు చేస్తూ సీమకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్‌రెడ్డి ఆరోపించారు.

జగన్‌మోహన్‌రెడ్డి ధనదాహానికి గురవుతున్న సీమను కాపాడేందుకే తెదేపా సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేకులు వేసే విధంగా వ్యవహరిస్తుంటే జగన్‌, ఆయన మంత్రులు నోరుమెదపడం లేదని విమర్శించారు. రాయలసీమలోని 49 మంది వైకాపా ఎమ్మెల్యేలకు దమ్ముంటే కేసీఆర్‌ ఇంటిని ముట్టడించాలని సవాల్‌ విసిరారు. సీమ ప్రాజెక్టులకు రూపాయి కూడా జగన్‌ ఖర్చు చేయలేదన్నారు. మిగులు జలాల ఆధారంగా రాయలసీమ రైతులకు న్యాయం చేయడానికి ఎన్టీఆర్‌.. హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే.. ఈ ముఖ్యమంత్రి నిధులు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా స్థాయి సదస్సులు పూర్తికాగానే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని దేశం నేతలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై పలు తీర్మానాలు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని