AP News: డీజీపీ స్పందించకపోవడం పోలీస్‌శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ: సోమిరెడ్డి

తాజా వార్తలు

Updated : 24/10/2021 13:39 IST

AP News: డీజీపీ స్పందించకపోవడం పోలీస్‌శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ: సోమిరెడ్డి

అమరావతి: ఏపీ పోలీసు వ్యవస్థపై హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. సీఎంకు ఒకటి, హైకోర్టు న్యాయమూర్తులకు మరో చట్టమా అనే ప్రశ్నను లేవనెత్తిందని గుర్తు చేశారు. పోలీస్‌ వ్యవస్థపై హైకోర్టు నమ్మకం కోల్పోయిందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థకు విలువేముంటుందన్నారు. తీవ్రమైన అభిశంసనపై కూడా డీజీపీ స్పందించట్లేదని.. ఇది పోలీస్‌శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ అని ఆక్షేపించారు. డీజీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే సముచితంగా ఉంటుందని సోమిరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని