AP News: ఏపీలో అప్పులు ఫుల్‌.. అభివృద్ధి నిల్‌: యనమల

తాజా వార్తలు

Updated : 14/10/2021 13:15 IST

AP News: ఏపీలో అప్పులు ఫుల్‌.. అభివృద్ధి నిల్‌: యనమల

పెద్దశంకర్లపూడి: ఏపీలో అప్పులు ఫుల్‌.. అభివృద్ధి నిల్‌ అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని విచారం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో తెదేపా నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో యనమల పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా విజయం ఖాయమని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. హెటిరో సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న సొమ్మంతా సీఎం జగన్‌ అక్రమార్జనే అని ఆరోపించారు. సీఎం చేయాల్సిన పనేంటి.. చేస్తున్నదేంటి అని ఆయన ప్రశ్నించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని