AP News: మంత్రి పెద్దిరెడ్డి జోలికొస్తే చంద్రబాబు కారుపై బాంబు వేస్తా!

తాజా వార్తలు

Updated : 22/10/2021 19:38 IST

AP News: మంత్రి పెద్దిరెడ్డి జోలికొస్తే చంద్రబాబు కారుపై బాంబు వేస్తా!

రెస్కో ఛైర్మన్‌ అనుచిత వ్యాఖ్యలు

కుప్పం పట్టణం: మంత్రి పెద్దిరెడ్డి జోలికొస్తే తెదేపా అధినేత చంద్రబాబు కారుపై బాంబు వేస్తానని వైకాపా నేత, గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) ఛైర్మన్‌ సెంథిల్‌ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్కన ఉన్నవాళ్లు మైక్‌ లాక్కొనే ప్రయత్నం చేసినప్పటికీ సెంథిల్‌.. మరింతగా రెచ్చిపోయి తిట్ల దాడిని కొనసాగించారు. 

కుప్పంలో ఉద్రిక్తత.. పోలీసులపై వైకాపా నేతల దౌర్జన్యం

మరోవైపు, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైకాపా ప్రజాగ్రహ దీక్షలో పాల్గొన్న రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరాయి. తెదేపా శ్రేణులు పట్టణంలోని ఎమ్‌ఆర్‌రెడ్డి కూడలికి చేరుకోగా... బస్టాండ్‌ వద్ద ప్రజాగ్రహ దీక్ష నుంచి వైకాపా నాయకులు కూడా కూడలి వద్దకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకుల అరుపులు, కేకలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైకాపా శాంతిపురం కన్వీనర్‌  కోదండరెడ్డి కుప్పం అర్బన్‌ సీఐని తోయడంతో పోలీసులు వైకాపా శ్రేణులను చెదరగొట్టారు.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని