Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

తాజా వార్తలు

Updated : 29/07/2021 15:52 IST

Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

హుజూరాబాద్‌: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజూరాబాద్‌ అంబేద్కర్‌ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్‌ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా.. అదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. దాన్ని తెరాస వర్గాయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు.

ఈ క్రమంలో హుజూరాబాద్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఈటల జమున పాలాభిషేకం చేశారు. అదే సమయంలో తెరాస వర్గీయులు అక్కడకు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్‌ ప్లెక్సీలు తగులబెట్టేందుకు భాజపా శ్రేణులు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భాజపా కార్యకర్తలను అడ్డుకొని నిలువరించారు. తెరాస వర్గీయులను అక్కడ నుంచి పంపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని