మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఫిక్స్‌డ్‌ రేట్ల ఎమ్మెల్యే: వైకాపా నేత తీవ్ర ఆరోపణలు 

తాజా వార్తలు

Updated : 18/10/2021 14:44 IST

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఫిక్స్‌డ్‌ రేట్ల ఎమ్మెల్యే: వైకాపా నేత తీవ్ర ఆరోపణలు 

నెల్లూరు: ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ ఆశయాలకు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి పనికీ ఎమ్మెల్యే కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. 

‘‘అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి మండల కన్వీనర్ల వరకు అమ్మకాలు చేపట్టారు. వింజమూరు మండల కన్వీనర్లను ఆరునెలల్లో మూడుసార్లు మార్చారు. వరికుంటపాడు ఎంపీపీ పదవిని అమ్ముకున్నారు. జడ్పీటీసీ టికెట్‌ కోసం రూ.50లక్షలు ఇచ్చాం. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఫిక్స్‌డ్‌ రేట్ల ఎమ్మెల్యేగా మారిపోయారు. 8 మంది దళారులను ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తున్నారు’’ అని సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో జడ్పీటీసీ రామాంజనేయులు, నేతలు సోమిరెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని