West benagal: వాళ్ల చేతులు నరికేస్తా.. టీఎంసీ ఎమ్మెల్యే హెచ్చరిక.. ఆపై క్షమాపణ!

తాజా వార్తలు

Published : 18/10/2021 01:31 IST

West benagal: వాళ్ల చేతులు నరికేస్తా.. టీఎంసీ ఎమ్మెల్యే హెచ్చరిక.. ఆపై క్షమాపణ!

కోల్‌కతా: తన నియోజకవర్గంలో ఉన్న ఓ ప్లే గ్రౌండ్‌ను సొంత పార్టీకి చెందిన వ్యక్తులే కబ్జా చేస్తున్నారని ఉత్తర 24 పరగణా జిల్లా కమర్హతి ఎమ్మెల్యే, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మదన్‌ మిత్రా ఆరోపించారు. స్థానిక ఎంపీతో కలిసి ప్లే గ్రౌండ్‌ను సుందరీకరించాలని తాను ప్రణాళికలు వేస్తుంటే.. కొందరు ఆ స్థలంలో అపార్ట్‌మెంట్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలకు పాల్పడుతున్నవారిలో ముగ్గురు తనకు తెలుసని వారిపై కేసు పెట్టనున్నట్లు చెప్పారు. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. ప్లే గ్రౌండ్‌ను కాపాడటం కోసం ప్రజా ఉద్యమం చేపడతానని అన్నారు. ఒకవేళ తనను వాళ్లు కొనాలని చూసినా, బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదని, కబ్జాదారుల చేతుల్ని నరికేస్తానని హెచ్చరించారు. అవసరమైతే సీఎం మమతా బెనర్జీని కలిసి పరిస్థితి వివరిస్తానని చెప్పారు. కాగా.. చేతులు నరికేస్తానని ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన స్పందించారు. తను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. క్షమాపణ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని