ఆ తేదీలోగా టీఎంసీ మొత్తం ఖాళీ: సువేందు

తాజా వార్తలు

Published : 31/01/2021 17:28 IST

ఆ తేదీలోగా టీఎంసీ మొత్తం ఖాళీ: సువేందు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందని భాజపా నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. ఇక ఆ పార్టీ ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ఆదివారం భాజపా ఆధ్వర్యంలో హౌడాలో నిర్వహించిన భారీ బహిరంగ సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వర్చువల్‌ మాధ్యమంలో ప్రసంగించగా.. సభకు ప్రత్యక్షంగా హాజరైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బెంగాలీలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.  శనివారం షా సమక్షంలో కొత్తగా భాజపాలో చేరిన ఐదుగురు టీఎంసీ నేతలూ ఈ సభలో పాల్గొన్నారు.  

‘తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయ పార్టీగా ఎక్కువ కాలం కొనసాగదు. అదో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి టీఎంసీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో ఎవరూ ఉండరు. మొత్తం ఖాళీ అవుతుంది’ అంటూ అధికారి టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా భాజపాలో చేరిన మాజీ మంత్రి రాజిబ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. ‘పశ్చిమబెంగాల్‌లో మనకు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కావాలి. కాబట్టి సోనార్‌ బంగ్లా సాకారం కావాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ మనకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి’ అన్నారు. 

పశ్చిమబెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి రాజిబ్‌ బెనర్జీ సహా మరో నలుగురు కీలక నేతలు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరిన విషయం తెలిసిందే. భాజపాలో చేరిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైశాలి దాల్మియా, ప్రభిర్‌ ఘోషాల్‌, హౌరా మాజీ మేయర్‌ రతిన్‌ చక్రవర్తి, రుద్రానిల్‌ ఘోష్‌లు ఉన్నారు. వీరి చేరికతో సోనార్‌ బంగ్లా కోసం భాజపా చేసే పోరాటం మరింత బలోపేతం కానుందని అమిత్‌షా కొనియాడారు. 

ఇదీ చదవండి

దీదీ ఇక ఒంటరే!

త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది: మోదీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని