UP: త్వరలో మంత్రివర్గ విస్తరణ..!

తాజా వార్తలు

Published : 16/07/2021 01:41 IST

UP: త్వరలో మంత్రివర్గ విస్తరణ..!

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. శుక్రవారం నిర్వహించబోయే రాష్ట్ర భాజపా కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలతోపాటు కేబినెట్‌ విస్తరణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

కొద్దిరోజుల క్రితం కేంద్ర కేబినెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో యూపీ నుంచి ఏడుగురు ఎంపీలకు చోటు కల్పించారు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో యూపీ ఎంపీల సంఖ్య 14కు చేరింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. కేంద్రంలో ఈ రాష్ట్రం నుంచి ఇంత మందికి మంత్రి పదవులు దక్కడం ఇదే ప్రథమం. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారికి మంత్రి పదవులు కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలపై భాజపా ఎక్కువ దృష్టి పెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొనేందుకు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడాన్ని కేంద్రం కీలకంగా భావిస్తోంది.  యూపీలో గత ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకుగాను భాజపా 312 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని