అక్కడ వ్యాక్సినేషన్‌ తక్కువ.. పైగా ఫేక్‌ సెంటర్లు!

తాజా వార్తలు

Published : 30/06/2021 01:03 IST

అక్కడ వ్యాక్సినేషన్‌ తక్కువ.. పైగా ఫేక్‌ సెంటర్లు!

బెంగాల్‌లో వ్యాక్సినేషన్‌ తీరుపై నడ్డా విమర్శలు

కోల్‌కతా: కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన వ్యాక్సినేషన్ పశ్చిమబెంగాల్‌లో తక్కువగా జరుగుతోందని, పైగా అక్కడ నకిలీ క్యాంపులు నిర్వహిస్తున్నారంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై మండిపడ్డారు. ఓ మహిళ సీఎంగా ఉన్న చోట మహిళలపై వేధింపులు జరగడాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇస్తున్నప్పటికీ మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్‌ ప్రభుత్వం పంపిణీలో విఫలమైందన్నారు.

దేశంలో  అతి తక్కువ వ్యాక్సినేషన్‌ పశ్చిమబెంగాల్‌లోనే జరుగుతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. అలాగే, ఈ రాష్ట్రంలోనే నకిలీ వ్యాక్సినేషన్‌ క్యాంపులు నడుస్తున్నాయని ఆక్షేపించారు. ఎప్పుడూ తాము నకిలీ వ్యాక్సినేషన్‌ గురించి వినలేదని, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ మిమి చక్రవర్తికి కూడా నకిలీ వ్యాక్సినే వేశారన్నారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి నిర్వహించిన పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగడం పాలనాయంత్రాంగం వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భాజపా కార్యకర్తల ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులను తీసేస్తున్నా పోలీసులు మౌనం వహిస్తున్నారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని