అసెంబ్లీ పోరు.. నామినేషన్ల జోరు

తాజా వార్తలు

Updated : 15/03/2021 14:45 IST

అసెంబ్లీ పోరు.. నామినేషన్ల జోరు

చెన్నై/తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రచారాల హోరు.. నామినేషన్ల జోరుతో సందడి నెలకొంది. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కన్నూర్‌ జిల్లాలోని ధర్మదాం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. నేడు తన నామపత్రాలు సమర్పించారు. కొవిడ్‌ నేపథ్యంలో ముఖానికి ఫేస్‌షీల్డ్‌, మాస్క్‌, గ్లౌజులు ధరించి వచ్చారు. ధర్మదాం నుంచి విజయన్‌ పోటీ చేస్తుండటం ఇది రెండోసారి. అంతకుముందు పయ్యన్నూర్‌ నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. 

పళని.. కాలినడకన వెళ్లి

మరో రాష్ట్రం తమిళనాడులోనూ నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి నేడు నామినేషన్ వేశారు. తన ఇంటికి సమీపంలోని స్థానిక తాలూకా కార్యాలయానికి కాలినడకన వెళ్లిన ఆయన నామపత్రాలు సమర్పించారు. ఎడప్పాడి నుంచి పళని.. 1989, 1991, 2011, 2016 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించారు.  

స్టాలిన్‌.. రోడ్‌షో

ఇక డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కూడా సోమవారమే నామినేషన్‌ వేశారు. వరుసగా మూడోసారి ఆయన కొలతూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామపత్రాల సమర్పణ అనంతరం స్టాలిన్‌ భారీ రోడ్‌ షో నిర్వహించారు. తమిళనాడు, కేరళలో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలోనూ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని