తాటాకు చప్పుళ్లకు భయపడను: వెలగపూడి

తాజా వార్తలు

Published : 27/12/2020 01:24 IST

తాటాకు చప్పుళ్లకు భయపడను: వెలగపూడి

విశాఖపట్నం : విశాఖపట్నంలో తెదేపా ఎమ్మెల్యేపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెదేపా, వైకాపా నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న వెలగపూడి మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని ఆయన స్పష్టం చేశారు. ‘నేను విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో వీళ్లేవరు. నేను విజయసాయిరెడ్డిని ప్రమాణం చేయమన్నాను’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానన్నారు. సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైకాపా నేతలు అంటున్నారని.. ఆ సవాలు స్వీకరిస్తున్నానని.. అక్కడ ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి వస్తారా.? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో వైకాపా నాయకురాలు విజయనిర్మల సాయిబాబా చిత్రపటంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వెనక్కి వెళ్లిపోయారు. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా తెదేపా, వైకాపా నాయకుల మధ్య ప్రమాణ సవాళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే.

 

ఇవీ చదవండి.. 
విశాఖలో రాజకీయ ప్రమాణాల సవాళ్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన

 
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని