AP news: హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం: వెల్లంపల్లి

తాజా వార్తలు

Updated : 14/06/2021 16:36 IST

AP news: హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం: వెల్లంపల్లి

అమరావతి: మాన్సాస్‌ ట్రస్టు కేసులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. హైకోర్టు తాజా తీర్పుపై అప్పీలుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వివాదాన్ని కూడా సీఎంకు చెప్పామన్నారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సీఎం సూచించారని అన్నారు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపికపై కమిటీని నియమించామని, నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే పీఠాధిపతి నియామకం జరుగుతుందని ఆయన వెల్లడించారు.కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో ఇవాళ ఉదయం ఉద్రికత్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పీఠాధిపతి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. పీఠాధిపత్యం సమస్య కొలిక్కి వచ్చిన తర్వాత మళ్లీ వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండు రోజుల పాటు మఠాధిపతులు ఇక్కడ పర్యటించి దివంగత పీఠాధిపతి పెద్దభార్య కుమారుడు వెంకటాద్రిస్వామికి అర్హత ఉందని తేల్చారని, కానీ శ్రీకాంత్‌ మాత్రం దివంగత పీఠాధిపతి రెండో భార్యకు అనుకూలంగా మాట్లాడుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీకాంత్‌ తాను ఎవరికీ అనుకూలంగా వ్యవహరించడం లేదని తేల్చి చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని