ఇలాంటి పరిస్థితుల్లో యూకేకు విమానాలా?

తాజా వార్తలు

Published : 07/01/2021 19:50 IST

ఇలాంటి పరిస్థితుల్లో యూకేకు విమానాలా?

నిషేధాన్ని పొడిగించాలంటూ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి 

దిల్లీ: కొత్త రకం కరోనా వైరస్‌తో సతమతమవుతున్న యూకేకు విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులను పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. యూకేలో కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, విమానాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. దేశంలో అతి కష్టం మీద కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. యూకేలో కరోనా పరిస్థితి దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమానాలపై నిషేధం ఎత్తివేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం ఎందుకని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

మరోవైపు, బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్‌ కలకలం నేపథ్యంలో డిసెంబర్‌ 22 నుంచి 31 వరకు విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించింది. అయితే, అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిషేధాన్ని మరో వారం పాటు (జనవరి 7వరకు) పొడిగిస్తూ  ఇటీవల కేంద్రం నిర్ణయం వెలువరించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..

8 నుంచి యూకేకు విమాన సర్వీసులుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని