Cabinet: ప్రధాని ఏది చెప్తే అదే: నితీశ్‌!

తాజా వార్తలు

Published : 06/07/2021 18:47 IST

Cabinet: ప్రధాని ఏది చెప్తే అదే: నితీశ్‌!

దిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ఈ నెల 8న మూహూర్తం ఖారారు చేసినట్లు వార్తలొస్తున్న తరుణంలో బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ ఓ మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఇవాళ్టి ఉదయం వరకు 4 మంత్రి పదవులివ్వాలని డిమాండ్‌ చేసిన జేడీయూ తాజాగా స్వరం మార్చింది. ‘ప్రధాని ఏం చెప్పినా దానికి సరే’ అనేందుకు నితీశ్‌ సిద్ధంగా ఉన్నట్లు అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

‘‘ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి పదవుల విషయంలో జరిగిందేదో జరిగిపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం ప్రధాని మోదీ నిర్ణయాన్ని అంగీకరిస్తాం’’ అని మంత్రి పదవులపై భాజపాతో సంప్రదింపులు జరిపేందుకు జేడీయూ నియమించిన కీలక నేత ఒకరు మీడియాకు చెప్పారు. కొత్తగా 20 మందికి పైనే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి.  భాజపా మిత్రపక్షమైన జేడీయూకు ఒక మంత్రిపదవి ఇవ్వాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

నిజానికి 2019లో మోదీ రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే మంత్రివర్గంలో జేడీయూకు చోటు ఇవ్వడంపై చర్చ జరిగింది. అప్పుడు జేడీయూకు ఒక మంత్రి పదవి ఇస్తామని భాజపా ఆఫర్‌ చేయగా.. నీతీశ్‌ తిరస్కరించారు. తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని, లేదంటే పూర్తిగా అవసరం లేదని తేల్చిచెప్పారు. దీనికి మోదీ సర్కారు అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని