దొంగ ఓట్లతోనే వైకాపా గెలిచింది: అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Published : 03/05/2021 13:54 IST

దొంగ ఓట్లతోనే వైకాపా గెలిచింది: అచ్చెన్నాయుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో వైకాపా దొంగ ఓట్ల సాయంతో విజయం సాధించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోలింగ్ రోజు వైకాపా అరాచకాలను ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. ప్రజలు నైతికంగా తెలుగుదేశాన్నే గెలిపించి.. వైకాపా మదాన్ని అణిచారన్న అచ్చెన్నాయుడు అందుకే అధికార పార్టీ నేతల ముఖాల్లో సంతోషం కరవైందన్నారు. వైకాపా దురాగతాలను బయటపెట్టిన తెలుగుదేశం శ్రేణుల్ని మనస్ఫూర్తిగా అభినందించారు. నకిలీ ఓటర్ కార్డులను అడ్డుకోకుండా పోలింగ్ అధికారులు వైకాపాకు సహకరించటంతో పాటు.. అడ్డుకున్న తెదేపా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, నిజమైన ఓటర్ల హక్కుల్ని వైకాపా కాలరాసిందన్నారు. ప్రతి అరాచకానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తాము దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైకాపా నేతలు ప్రమాణానికి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని