సీఎం ఆదేశిస్తే రాజీనామా చేస్తాం: రఘురామ

తాజా వార్తలు

Updated : 20/07/2021 15:18 IST

సీఎం ఆదేశిస్తే రాజీనామా చేస్తాం: రఘురామ

దిల్లీ: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని.. అయితే అక్కడ విచారణ జరిపించలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలి వచ్చిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం ఆదేశిస్తే ఎంపీలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్లమెంట్‌లో తొలిసారి వైకాపా ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారని అన్నారు. బెయిల్ రద్దు చేయమని కోర్టును ఆశ్రయించడం రాజద్రోహం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తన వాట్సాప్‌ చాటింగ్ బయట పెట్టాలంటున్నారని పేర్కొన్నారు. అయితే తాను సందేశం పంపించినంత మాత్రాన అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని