close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

బాగుచేయాలని గవర్నర్‌కు భాజపా వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నతవిద్యా రంగాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా విమర్శించింది. మంగళవారం ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని రాజ్‌భవన్‌లో కలిసింది. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులను నియమించాలని, పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని..యూనివర్సిటీలు, డిగ్రీ, ఇంటర్‌ కళాశాలలో ఖాళీల భర్తీ జరిగేలా చూడాలంటూ వినతిపత్రం అందజేసింది. పార్టీ సీనియర్‌ నేత పి.మురళీధర్‌రావు, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి గవర్నర్‌ను కలిసిన భాజపా బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం పరిస్థితిని వివరించిన కమలనాథులు.. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యారంగాన్ని బాగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు