వాట్‌ ఏ ‘మ్యావ్‌’మెంట్‌

తాజా వార్తలు

Published : 03/08/2021 23:57 IST

వాట్‌ ఏ ‘మ్యావ్‌’మెంట్‌

‘పిల్లి మాస్కు’ ధరించి స్వర్ణం స్వీకరించిన రష్యన్‌ స్విమ్మర్‌


ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌ వేదికలపై క్రీడాకారుల చిత్రవిచిత్ర ప్రవర్తనలు ఆకట్టుకుంటున్నాయి.  తాజాగా ఆర్‌వోసీ(రష్యా)కు చెందిన స్విమ్మర్‌ ఎవ్‌జీని రైలొవ్‌.. తనకెంతో ఇష్టమైన ‘పిల్లి మాస్క్‌’ ధరించి బంగారు పతకం స్వీకరించడం ఆసక్తిగా మారింది. అతను 100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణాలు సాధించాడు. పతకం తీసుకునే సమయంలో సదరు మాస్క్‌ ధరించేందుకు తొలుత నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. ‘ఆ క్షణంలో నాకు ఏడుపు వచ్చింది. కానీ నేను ఈ విషయమై వాదనకు దిగలేదు.  చివరకు వారే నా కోరికను మన్నించడంతో సంతోషానికి గురయ్యా.  విజయాలకు ఆకాశమే హద్దు అని తెలుసు. ఇతర విభాగాల్లోనూ నన్ను నేను నిరూపించుకోవాల్సి ఉంద’ని అతను పేర్కొన్నాడు.
స్వతహాగా ఇష్టం..
సదరు క్రీడాకారుడు స్వతహాగా మార్జాల ప్రేమికుడు కావడం విశేషం.  తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తరచూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతుంటాడు. మరో విశేషం ఏంటంటే.. స్విమ్మింగ్‌ విభాగంలో అతను ఆ దేశం తరఫున 1996 తర్వాత స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలవడం. మరోవైపు ఈ క్రీడల్లో ఆర్‌వోసీ తరఫున 330 మంది పాల్గొంటున్నారు. డోపింగ్‌ వివాదం నేపథ్యంలో రష్యాను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో వారు రష్యా ఒలింపిక్‌ కమిటీ(ఆర్‌వోసీ) కింద ఇందులో భాగమయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని