close

తాజా వార్తలు

Updated : 18/10/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా హైదరాబాద్‌, కోల్‌కతా జట్లు మరికొద్దిసేపట్లో తమ తొమ్మిదో మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన వార్నర్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఆడిన ఎనిమిదింటిలో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో కొనసాగుతుండగా, హైదరాబాద్‌ 3 విజయాలు, 5 ఓటములతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే మరో మ్యాచ్‌లో తలపడడానికి సిద్ధమయ్యాయి. కాగా, వార్నర్‌ సేన ఈ మ్యాచ్‌లో గెలుపొంది‌ కోల్‌కతాను అధిగమించి నాలుగో స్థానంలో నిలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 6 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

హైదరాబాద్‌ జట్టు: డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, బాసిత్‌ థంపి

కోల్‌కతా జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, పాట్‌కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.