close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/04/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఐపీఎల్‌పై ఇంకా ఆసక్తి ఉంది: పాట్‌కమిన్స్‌

కరోనా వైరస్‌ తీవ్రత తగ్గించడమే ప్రధాన లక్ష్యం

సిడ్నీ: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌కమిన్స్‌ అన్నాడు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో కమిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.15.50 కోట్లు వెచ్చించి ఆసీస్‌ పేసర్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో సతమతమవుతుంది. దీంతో అన్ని దేశాల్లో క్రీడా పోటీలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ను సైతం ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు. ఇప్పుడు భారత్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సందర్భంగా ఈ సీజన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వహకులు ఇంకా చెప్పలేదని, అలాంటి విషయాలేవీ పేర్కొనలేదని కమిన్స్‌ పీటీఐతో అన్నాడు. ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పాడు. తామంతా కొన్ని రోజులుగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రతీ ఒక్కరూ ఇంకా ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే ప్రధాన లక్ష్యమని తెలిపాడు. అనంతరం ఐపీఎల్‌లో పాల్గొనడంపై మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో అది తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్నాడు. అయితే, తాను ఏ విషయంలోనూ తొందరపడనని, ఉన్నపళంగా అన్ని జరిగిపోవాలని ఆశించనని తెలిపాడు. తనకు మాత్రం కచ్చితంగా ఐపీఎల్‌ ఆడాలని ఉందన్నాడు. అలాగే ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌పైనా కమిన్స్‌ స్పందించాడు. ఆ మెగా టోర్నీకి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నాడు. టీ20 ప్రపంచకప్‌ సజావుగా సాగితే చూడాలని ఉందన్నాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటన కూడా షెడ్యూల్‌ ప్రకారం జరగాలని ఆకాంక్షించాడు. ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌ కూడా జరగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.