close

తాజా వార్తలు

Updated : 29/09/2020 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డుప్లెసిస్‌ చెలరేగినా.. రాజస్థాన్‌దే విజయం 

ధోనీసేనకు తొలి ఓటమి

శాంసన్‌, స్మిత్‌, ఆర్చర్‌ సిక్సుల మోత..

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నైతో తలపడిన తొలి పోరులో రాజస్థాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ధోనీసేన 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో స్టీవ్‌స్మిత్‌ జట్టు ఈ సీజన్‌లో శుభారంభం చేసింది. ఛేదనలో డుప్లెసిస్‌(72; 36 బంతుల్లో 1x4, 7x6) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. షేన్‌వాట్సన్‌(33), మురళీ విజయ్‌(21), సామ్‌ కరన్‌(17), కేదార్‌ జాధవ్‌(22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్‌ ధోనీ(28; 16 బంతుల్లో 3x6) హ్యాట్రిక్‌ సిక్సులు బాదడంతో ఆ జట్టు స్కోర్‌ 200కి చేరింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత సంజూ శాంసన్‌(74; 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్‌స్మిత్‌(69; 47 బంతుల్లో 4x4, 4x6) సిక్సుల వర్షం కురిపించగా.. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌(27; 8 బంతుల్లో 4x6) సైతం అదే పనిచేశాడు. అతడు నాలుగు సిక్సులు సంధించి ఆ జట్టు స్కోరును 216కి తీసుకెళ్లాడు. అంతకుముందు ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(6) మూడో ఓవర్‌లోనే చాహర్‌ చేతికి చిక్కి ఔటవ్వగా తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏ మాత్రం కనికరం లేకుండా సిక్సుల మోత మోగించాడు. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్నంతలా చెలరేగిపోయాడు. స్మిత్‌తో కలిసి అతడు రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే శతకం వైపు వెళ్తున్న సంజూని ఎంగిడి ఔట్‌ చేశాడు. భారీ సిక్సర్‌ కొట్టబోయిన అతడు దీపక్‌ చాహర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్మిత్‌కు సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. ఆఖరికి అతడు కూడా 69 పరుగులు చేశాక సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌కు చిక్కాడు. చివర్లో ఆర్చర్‌ అదరగొట్టడంతో రాజస్థాన్‌ భారీ స్కోర్‌ చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.