close

తాజా వార్తలు

Published : 12/08/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌: RRకు షాక్‌..ఫీల్డింగ్‌ కోచ్‌కు కొవిడ్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2020కి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌కు షాక్‌! ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌కు కొవిడ్‌-19 సోకింది. 14 రోజుల పాటు ఆయన స్వీయ ఏకాంతంలోకి వెళ్లనున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ఏకాంతంలోకి వెళ్లాలని ఫ్రాంచైజీ కోరింది. మిగతా అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19న ఐపీఎల్‌-2020 ఆరంభం అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లే ముందు 24 గంటల ముందు రెండుసార్లు ఆర్‌సీటీ పీసీఆర్‌ పరీక్షలు చేయించాలని బీసీసీఐ నిబంధనలు విధించింది. వచ్చేవారం రాజస్థాన్‌ రాయల్స్‌ సభ్యులంతా ముంబయి శిబిరానికి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆ ఫ్రాంచైజీ అందరికీ అదనంగా ఓ పరీక్ష చేయించింది.

ప్రస్తుతం దిశాంత్‌ తన సొంతూరు ఉదయ్‌పూర్‌లో ఉన్నారు. 14 రోజులు క్వారంటైన్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత బీసీసీఐ నిబంధనల ప్రకారం రెండు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్‌ వస్తే తిరిగి జట్టులో చేర్చుకుంటారు. యూఏఈకి చేరుకున్నాక మళ్లీ మూడు పరీక్షలు చేయించుకొని ఆరు రోజులు స్వీయ ఏకాంతంలో ఉండాలి. ఆ తర్వాతే బయోబుడగలో అడుగుపెట్టాలి.

పది రోజులుగా దిశాంత్‌తో సన్నిహితంగా ఉన్నవారంతా కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకొని స్వీయ ఏకాంతంలోకి వెళ్లాలని ఫ్రాంచైజీ కోరింది. రాజస్థాన్‌ రాయల్స్‌ సిబ్బంది, ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నారని దిశాంత్‌తో సన్నిహితంగా లేరని వెల్లడించింది. ఆయన‌ త్వరగా కోలుకొని జట్టులో అడుగుపెట్టాలని కోరింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.