
తాజా వార్తలు
ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చేనెలలో కివీస్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ చేరుకున్న పాకిస్థాన్ జట్టులో ఆరుగురికి కరోనా సోకిందని అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. ఈనెల 24న లాహోర్ నుంచి క్రైస్ట్‌చర్చ్‌కి చేరుకున్న 53 మంది పాక్ ఆటగాళ్లకు కొవిడ్-19 పరీక్షలు చేయగా ఆరుగురు వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. దీంతో మిగతా ఆటగాళ్లని హోటల్ గదులకే పరిమితం చేశారు. వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని చెప్పారు. అయితే, పాక్ ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నాక కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారని స్థానిక అధికారులు గుర్తించారు.
పలువురు ఆటగాళ్లు కరోనా నియమాలు పాటించలేదని సీసీటీవీల్లో రికార్డైంది. దాంతో ఆ జట్టు మొత్తానికి హెచ్చరికలు జారీ చేశామని స్థానిక అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాగే మిగతా ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు కూడా అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై మొత్తం విచారణ పూర్తయ్యాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ను నియంత్రించడంలో న్యూజిలాండ్ గట్టి చర్యలు తీసుకుంది. పటిష్టమైన లాక్డౌన్, కరోనా నిబంధనలు పాటించి వైరస్ వ్యాప్తిని గతంలోనే సంపూర్ణంగా అరికట్టింది. ఎవరైనా కివీస్‌కు వచ్చి ఆటలాడితే తమకు సంతోషమని, అయితే.. ఆటగాళ్లు కొవిడ్-19 వ్యాప్తికి కారణం కాకుండా నియమాలు పాటించాలని ఆ అధికారి స్పష్టంచేశారు. మరోవైపు లాక్డౌన్ తర్వాత క్రికెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా పలువురు పాక్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో వారిని పంపించకుండా పాక్ జట్టు చర్యలు తీసుకుంది. ఆయా ఆటగాళ్లు కోలుకున్నాక ఇంగ్లాండ్‌కు పంపించింది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
