భారత్‌×ఆసీస్‌: సిడ్నీ టెస్టు జరిగేనా?

తాజా వార్తలు

Published : 18/12/2020 23:20 IST

భారత్‌×ఆసీస్‌: సిడ్నీ టెస్టు జరిగేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిడ్నీ నగరంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి స్థానిక అధికారులు, ప్రభుత్వం పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ మరిన్ని కేసులు పెరిగితే ఆస్ట్రేలియా, భారత్‌ మూడో టెస్టు నిర్వహణ సందిగ్ధంగా మారనుంది. అయితే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మ్యాచ్‌ మాత్రం తప్పకుండా నిర్వహిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ధీమా వ్యక్తం చేసింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు జనవరి 7న సిడ్నీలో మొదలుకానుంది.

‘మా వైద్య నిపుణులతో మేం తీవ్రంగా చర్చలు జరుపుతున్నాం. అయితే కరోనా ఉందని మా ఆటగాళ్లను వేసవి నుంచి బయో బుడగల్లో ఉంచుతున్నాం. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. మేమేమీ భయపడటం లేదు. వేచిచూసే ధోరణి కనబరుస్తున్నాం. దేశవ్యాప్తంగా మహమ్మారిని ప్రభుత్వం మెరుగ్గా నియంత్రిస్తోంది’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లే అన్నారు.

సిడ్నీ టెస్టు జరగడం సందేహమేనా అని ప్రశ్నించగా.. ‘అలా అనుకోవడం లేదు. ఈ కారణంతోనే మేం క్రికెటర్లను బయో బుడగల్లో ఉంచుతున్నాం. డబ్ల్యూబీబీఎల్‌, బీబీఎల్‌, బీసీసీఐ, సీఏ క్రికెటర్లు బుడగ నిబంధనలను నిక్కచ్చిగా పాటిస్తున్నారు. మా వైద్య నిపుణులు నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ సురక్షితంగా అనిపిస్తేనే సిడ్నీలో నిర్వహిస్తాం. లేదంటే మా అత్యవసర ప్రణాళికల్లో మేమున్నాం’ అని హాక్లే తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని