ఆరడుగుల కేకుతో మారడోనాకు వినూత్న నివాళి

తాజా వార్తలు

Published : 28/12/2020 22:56 IST

ఆరడుగుల కేకుతో మారడోనాకు వినూత్న నివాళి

చెన్నై: ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. పైగా ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేని భారత్‌లోనూ డిగోను ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు. తాజాగా.. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన ఓ బేకరీ యజమాని వినూత్న రీతిలో మారడోనాకు నివాళి అర్పించారు.  క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా డిగో నిలువెత్తు కేక్​ను రూపొందించి దుకాణం ముందు ప్రదర్శనకు ఉంచారు. నాలుగు రోజులు శ్రమించి.. 60 కిలోల చక్కెర, 270 గుడ్ల వినియోగించి ఆరు అడుగుల మారడోనా రూపంలో ఉన్న కేకు రూపొందించారు. ప్రస్తుతం ఈ కేక్‌ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.

‘ఏటా మేము ప్రముఖుల విగ్రహాల కేకులను తయారు చేస్తాం. ఇప్పటికే ఇళయరాజా, అబ్దుల్‌కలాం, భారతీయార్‌ సహా పలువురి కేకులను రూపొందించాం. క్రికెట్​కు సచిన్, వంద మీటర్ల పరుగుకు బోల్ట్​, బాక్సింగ్​కు మైక్​ టైసన్​ ఎలాగో.. ఫుట్​బాల్​ అనగానే మారడోనా గుర్తుకొస్తాడు. ఈ కేక్​ ఆయనకు నివాళిగా తయారు చేశాం. అలాగే పిల్లలు ఫోన్లలో కాకుండా ఆరుబయట ఆడుకోవాలని ప్రోత్సాహిస్తున్నాం’ అని బేకరీ యజమాని సతీశ్ రంగనాథన్ తెలిపారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న డిగో మారడోనా.. గత నవంబరు 25న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని