Corona: టీమ్‌ఇండియా క్రికెటర్‌కు కరోనా

తాజా వార్తలు

Updated : 15/07/2021 11:39 IST

Corona: టీమ్‌ఇండియా క్రికెటర్‌కు కరోనా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న కోహ్లీసేనలో ఒక ఆటగాడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ ఆటగాడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. గతనెల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కివీస్‌తో తలపడిన టీమ్‌ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సుమారు 40 రోజుల విరామం దొరకడంతో జట్టు యాజమాన్యం ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. దాంతో కుటుంబసభ్యులతో కలిసి యూకేలో ఎక్కడైనా తిరిగేందుకు అనుమతులిచ్చింది. 

ఈ క్రమంలోనే పలువురు ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాలను చుట్టేశారు. మరికొందరు వింబుల్‌డన్‌, యూరోకప్‌ లాంటి మెగా ఈవెంట్లను చూసేందుకు ఆయా స్టేడియాలకు వెళ్లారు. ఇక బుధవారంతో ఆటగాళ్లకు ఇచ్చిన గడువు పూర్తవడంతో నేడు వారంతా దుర్హమ్‌లో బయోబుడగలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆటగాడికి డెల్టా వేరియంట్‌ వైరస్‌ సోకినట్లు తెలిసింది. విషయం తెలిసిన బీసీసీఐ సెక్రటరీ జైషా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని లేఖ రాశారు. ప్రస్తుతం కరోనా సోకిన ఆటగాడికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రత్యేకంగా ఒకచోట ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, మిగతా ఆటగాళ్లంతా నేటి నుంచి బయోబుడగలోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనున్నారు. అంతుకుముందు దుర్హమ్‌లో కౌంటీ XI జట్టుతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని