Rishabh Pant: పంత్‌కు అండగా దాదా!

తాజా వార్తలు

Published : 16/07/2021 10:15 IST

Rishabh Pant: పంత్‌కు అండగా దాదా!

రోజంతా మాస్క్‌ ధరించడం అసాధ్యమని వెల్లడి

ముంబయి: టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అండగా నిలిచారు. ప్రస్తుతం నిబంధనలు మారాయని తెలిపారు. నిజ జీవితంలో పూర్తిగా మాస్కులు ధరించడం కష్టమని వెల్లడించారు.

ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న రిషభ్ పంత్‌కు డెల్టా వేరియెంట్‌ సోకడం గురువారం సంచలనం సృష్టించింది. టీమ్‌ఇండియాలో ఒక ఆటగాడికి కరోనా వచ్చిందని తెలియగానే ఐదు టెస్టుల సిరీసు ఎలా సాగుతుందోనని భయపడ్డారు. అయితే పంత్‌కు పాజిటివ్‌ వచ్చి ఎనిమిది రోజులైందని, ప్రస్తుతం లక్షణాలేవీ లేవని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యూరో కప్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లినప్పుడు అతడు మాస్క్ ధరించలేదని కొందరు విమర్శించారు.

‘ఇంగ్లాండ్‌లో యూరో ఛాంపియన్‌షిప్‌, వింబుల్డన్‌ జరగడం మనం చూశాం. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తుండటంతో నిబంధనలు మారాయి. అప్పుడు ఆటగాళ్లు విరామంలో ఉన్నారు. అయినా రోజంతా మాస్క్‌లు ధరించడం భౌతికంగా అసాధ్యం. పంత్‌ గురించి మేం దిగులు చెందడం లేదు. అతడి ఆరోగ్యం మెరుగవుతోంది. రెండు టెస్టుల్లో నెగెటివ్‌ రాగానే జట్టుతో కలుస్తాడు’ అని గంగూలీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని