తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు

తాజా వార్తలు

Published : 23/01/2021 01:44 IST

తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు

ఇంటర్నెట్‌డెస్క్: గబ్బాలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. అభిమానులు నీరాజనాలు పలికారు. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాను గొప్పగా నడిపించిన అజింక్య రహానెకు ‘ఆలారే ఆలా.. అజింక్య ఆలా’ నినాదాలతో గొప్ప స్వాగతం పలుకుతూ సందడి చేశారు. అయితే అభినందన కార్యక్రమంలో రహానెను కొందరు సన్నిహితులు ఓ కేక్‌ను కట్ చేయమని కోరారు. కానీ, దానికి జింక్స్‌ తిరస్కరించాడు. దీంతో నెటిజన్లు తాత్కాలిక కెప్టెన్‌ను కొనియాడుతున్నారు. కేక్ కట్‌చేయకపోతే రహానెను నెటిజన్లు ఎందుకు కొనియాడుతారు అనేది మీ సందేహమా? అయితే ఇది చదవాల్సిందే!

మతుంగలో రహానెకు అభిమానులు, సన్నిహితులు గొప్ప స్వాగతం పలికారు. అయితే కంగారూల గడ్డపై సిరీస్ గెలిచిన జ్ఞాపకంగా కొందరు స్నేహితులు.. రహానెతో కేక్‌ కట్ చేయించాలని ఓ ప్రత్యేకమైన కేక్‌ను తీసుకువచ్చారు. కంగారూ కూర్చొని భారత జాతీయ జెండాను పట్టుకున్న ఆకారంలో ఆ కేక్‌ ఉంది. కాగా, మువ్వెన్నల జెండాతో పాటు ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూను రహానె గౌరవిస్తూ.. కేక్‌ను కట్‌ చేయనని సున్నితంగా తిరస్కరించాడు. ఇరు దేశాల గౌరవాల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీంతో రహానె వ్యక్తిత్వాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. మరోసారి నీ ప్రత్యేకతని నిరూపించుకున్నావ్‌ రహానె అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఇలాంటి జట్టును ఎప్పుడూ చూడలేదు: ఇంజమామ్‌

టీమిండియాకు కొత్త ఫిట్‌నెస్‌ టెస్ట్‌?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని