టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

తాజా వార్తలు

Updated : 07/01/2021 04:52 IST

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం రహానె సారథ్యంలో రెండు టెస్టు గెలిచిన భారత్‌.. మూడో టెస్టులో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇక మూడో టెస్టులో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో తొలిరెండు టెస్టుల్లో విఫలమైన మయాంక్‌ అగర్వాల్‌పై వేటు పడింది. ఆరంగేట్ర మ్యచ్‌లో ఫర్వాలేదనిపించిన శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించనున్నాడు. రెండో టెస్టులో గాయంతో మైదానాన్ని వీడిన ఉమేశ్‌యాదవ్‌ స్థానంలో హరియాణా పేసర్‌ నవదీప్‌ సైనీ జట్టులోకి వచ్చాడు. దీంతో సైనీ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున 299వ ఆటగాడిగా ఆరంగేట్రం చేయనున్నాడు. 


భారత జట్టు: రోహిత్‌, గిల్‌, పుజారా, రహానె, విహారి, పంత్‌, జడేజా, అశ్విన్‌, సైని, సిరాజ్‌, బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు: వార్నర్‌, పకోస్కీ, లబుషేన్‌, స్మిత్‌, వేడ్‌, గ్రీన్‌, పైన్‌, కమిన్స్‌, స్టార్క్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌

ఇవీ చదవండి..

చాలా బాధగా ఉంది: రాహుల్‌

ఆకలిగొన్న సింహంలా స్మిత్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని