Virat kohli: విరాట్‌ తాగే బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర ఎంతో తెలుసా?

తాజా వార్తలు

Updated : 23/08/2021 13:15 IST

Virat kohli: విరాట్‌ తాగే బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర ఎంతో తెలుసా?

ముంబయి: భారత క్రికెట్‌ జట్టులో ఉన్న క్రికెటర్స్‌ అందరితో పాటు టీమ్‌ ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కి అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఆయన చేసే వర్కౌట్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో పంచుకుంటారు కూడా. ఇక ఆయన డైట్‌ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తారు. ఇవి కేవలం ఆహారానికే వర్తిస్తాయనుకుంటే పొరపాటే.. ఆయన మినరల్‌ వాటర్‌ కి బదులు ‘బ్లాక్‌ వాటర్‌’ని సేవిస్తారట. ఈ బాటిల్‌ లీటర్‌ ధర తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు మరి. ఎందుకంటారా.. మినరల్‌ వాటర్‌ బాటిల్‌ లీటర్‌ రూ.20-40 ఉంటే.. బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర సుమారు రూ.600 నుంచి రూ.3000 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్‌ వాటర్‌ తాగడం మొదలెట్టాడు కోహ్లీ.  కేవలం కోహ్లీ మాత్రమే కాదు, బాలీవుడ్‌ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్‌ ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.

అసలేమిటీ ‘బ్లాక్‌ వాటర్‌’.. వాటి లాభాలు

బ్లాక్‌ వాటర్‌లో సహజసిద్ధమైన అల్కలైన్‌ ఉంటుంది. ఇవి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. తద్వారా వ్యాధులు నుంచి దూరం ఉండొచ్చు. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు మీ జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం రోజూ తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది.





Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని