చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం..
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం..

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ యువపేసర్‌ చేతన్‌ సకారియా ఈరోజు తన తండ్రిని కోల్పోయాడు. ఇటీవల కరోనా బారిన పడిన కంజీభాయ్‌ సకారియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆదివారం మృతిచెందినట్లు రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ ఓ ట్వీట్‌ చేసి విషయాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా సంతాపం ప్రకటించి చేతన్‌కు అండగా ఉంటామని చెప్పింది.

కాగా, చేతన్‌ ఈ ఏడాది ఆరంభంలో తన సోదరుడుని కూడా కోల్పోయాడు. ఐపీఎల్‌కు ఎంపికవ్వకముందు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు దాచిపెట్టారు. అతడు తిరిగి ఇంటికి చేరుకున్నాక అసలు విషయం చెప్పారు. ఇక అతడు ఐపీఎల్‌ ఆడుతుండగా తండ్రి కంజీభాయ్‌ కరోనా వైరస్‌కు గురయ్యాడని తెలిసింది. టోర్నీ వాయిదా పడ్డాక ఇంటికి చేరుకొని తండ్రిని చూసుకుంటున్నాడు. ఐపీఎల్‌తో తనకు వచ్చిన సొమ్ముతో నాన్నకు చికిత్స అందిస్తున్నట్లు ఇటీవల సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చేదువార్త వినాల్సి వచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని