ఆ కారులో షికార్లు కొడుతున్న నవదీప్ సైని..

తాజా వార్తలు

Published : 20/05/2021 01:18 IST

ఆ కారులో షికార్లు కొడుతున్న నవదీప్ సైని..

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్ర సిరీస్‌లోనే టీమ్‌ ఇండియా యువ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైని, నటరాజన్, మహ్మద్ సిరాజ్‌, శుభమన్‌ గిల్, వాషింగ్టన్‌ సుందర్‌లు అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరు కనబరిచిన ప్రదర్శనను మెచ్చుకుంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

నవదీప్‌ సైని కూడా ఈ మహీంద్రా ఎస్‌యూవీని అందుకున్నాడు. అయితే, ప్రస్తుతం సైని తన ఎస్‌యూవీ కారులో షికార్లకెళ్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. మట్టి, కంకర, బురద రోడ్లపై కారును వేగంగా నడిపి పరీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సైని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ‘అవును, నేను మురికి రోడ్డుపై చిల్‌(ఎంజాయ్‌) చేస్తున్నా @మహీంద్రా థార్’ అనే వ్యాఖ్యను జత చేశాడు. ఆలస్యమేందుకు మీరు కూడా ఆ వీడియోని చూసేయండి!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని