ఆ అయిదుగురిని దుబాయి తరలించనున్న సీఎస్‌కే యాజమాన్యం.!

తాజా వార్తలు

Published : 11/09/2021 02:23 IST

ఆ అయిదుగురిని దుబాయి తరలించనున్న సీఎస్‌కే యాజమాన్యం.!

దుబాయి : భారత్‌ ఇంగ్లాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్‌ రద్దు కావడంతో.. ఆయా జట్లలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో దుబాయి తరలించాలని సీఎస్‌కే యాజమాన్యం భావిస్తోంది. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్‌ పుజారా, శార్దూల్‌ ఠాకూర్‌లతో పాటు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌  ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. 

‘ఛార్టెర్డ్‌ ఫ్లైట్‌లో ఆటగాళ్లను తరలించడం సాధ్యం కాదు. అందుకే, కమర్షియల్‌ ఫ్లైట్‌లో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నాం. వారు ఇక్కడికి చేరుకున్న వెంటనే.. ఆరు రోజులు క్వారంటెయిన్‌లో ఉంచుతాం’ అని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. 

చివరి టెస్టు మ్యాచ్‌కు ముందు రోజు టీమిండియా అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ కరోనా బారిన పడినప్పటి నుంచి.. ఆటగాళ్లంతా తమకు కేటాయించిన హోటల్‌ గదుల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని