స్టేడియాన్ని టీకా కేంద్రంగా ఉపయోగించుకోండి

తాజా వార్తలు

Updated : 16/05/2021 11:20 IST

స్టేడియాన్ని టీకా కేంద్రంగా ఉపయోగించుకోండి

ఇంటర్నెట్ డెస్క్‌:  దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియాన్ని కొవిడ్ 19 టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని దిల్లీ డిస్ట్రిక్స్‌  క్రికెట్ అసోసియేషన్‌ (డీడీసీఏ) ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ  ప్రభుత్వానికి లేఖ రాసినట్లు డీడీసీఏ బోర్డు అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ వెల్లడించారు.

‘టీకాలు వేయడానికి మరొక కేంద్రం అవసరమని  భావిస్తే సాధారణ పరిస్థితులు ఏర్పడి క్రికెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేంత వరకు స్టేడియాన్ని టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశా. ఇక్కడ రోజుకు 10,000 మందికి టీకా వేయడానికి అవసరమైన సౌకర్యాలున్నాయి. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు’ అని రోహన్‌ జైట్లీ పేర్కొన్నారు.

మరోవైపు.. దిల్లీలో కరోనా తీవ్రత తగ్గుతోందని, పాజిటివిటీ రేటు 11 శాతానికి తగ్గిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వెల్లడించారు. శనివారం 6500 కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని