Cricket: పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు

తాజా వార్తలు

Updated : 21/09/2021 00:24 IST

Cricket: పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. అక్టోబరులో ఇంగ్లాండ్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. 2005 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ పర్యటన ఖరారైంది. ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు ఇంతకు ముందు ఎప్పుడూ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇటీవల భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్‌ జట్టు పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంగ్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌ బాటలో నడిచింది. ఆటగాళ్లు, , సిబ్బంది శ్రేయస్సు దృష్ట్యా పాక్‌ పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) వెల్లడించింది. దీంతో న్యూజిలాండ్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తెరుకోకముందే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు మరో షాక్ తగిలినట్లయింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని