తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ

తాజా వార్తలు

Published : 04/02/2021 16:04 IST

తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ

చెన్నై: టీమ్‌ఇండియాతో రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్‌ జాక్‌ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్టులకూ దూరమయ్యాడు. బుధవారం అతడి పుట్టిన రోజు సందర్భంగా చెపాక్‌లోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో అనుకోకుండా కిందపడ్డాడు. దాంతో కుడిచేతి మణికట్టుకు గాయమైంది. వైద్య పరీక్షలు చేయించగా గాయం తీవ్రమైందని, ఇక్కడ జరిగే రెండు టెస్టులకూ అతడు ఆడలేడని ఆ జట్టు యాజమాన్యం పేర్కొంది. తమ వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ఇలా జరగడం నిరాశ కలిగించిందని చెప్పాడు. క్రాలే ఈ సిరీస్‌ కోసం ఆశగా ఉన్నాడని, ఇక్కడ రాణించేందుకు ఆసక్తి చూపాడని రూట్‌ అన్నాడు. అనుకోకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కిందపడినట్లు వివరించాడు. ఇప్పుడతడు ఆడలేని స్థితిలో వేరొకరిని తీసుకోవాల్సి ఉందని, తమ జట్టులో తగిన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని ఇంగ్లాండ్‌ సారథి పేర్కొన్నాడు. ఏదేమైనా టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టుతో తలపడేందుకు అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతామని రూట్‌ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, క్రాలే ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా 616 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో ఈ ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 35 పరుగులే చేశాడు. 

ఇవీ చదవండి..
గబ్బా టెస్టులో అలా చేసిందెవరో తెలిసింది 
రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని