
తాజా వార్తలు
గబ్బా టెస్ట్: రెండో వికెట్ పడింది...
బ్రిస్బేన్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ రెండో వికెట్ కూడా పడగొట్టింది. తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కి వచ్చిన శార్దూల్ ఠాకూర్ తొలి బంతికే వికెట్ తీశాడు. మార్కస్ హారిస్ (5) వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందే మ్యాచ్ తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ (1)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపించేశాడు. తొలి ఓవర్ ఐదో బంతికి స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్ స్లిప్‌కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (15), మార్నస్ లబుషేన్ (8) ఉన్నారు. 13 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 35/2.
Tags :