
తాజా వార్తలు
2001.. ఓడామంటే భజ్జీ వల్లే: స్టీవ్‌వా
ఇంటర్నెట్ డెస్క్: వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ మాత్రమే 2001లో తమపై టీమ్ఇండియాకు సిరీస్ విజయం అందించాడని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా అన్నాడు. అతడి అదనపు స్పిన్, బౌన్స్‌కు తమ వద్ద జవాబే లేదని పేర్కొన్నాడు. భజ్జీ సంప్రదాయ స్పిన్నర్ కాదని, భిన్నమైన వాడని ప్రశంసించాడు. ఒక ఇంటర్వ్యూలో స్టీవ్‌వా 2001 సిరీసు గురించి మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్.కామ్.ఏయూ ట్వీట్ చేసింది.
‘టీమ్ఇండియాకు సిరీస్ అందించింది హర్భజన్ సింగ్. మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసుకున్నాడు. అతడి బౌన్స్‌కు మా వద్ద జవాబే లేదు. లెంగ్త్‌కు తోడుగా అద్భుతమైన బౌన్స్ అతడి సొంతం. ప్రతి స్పెల్‌లో అతడు మాపై ఆధిపత్యం చెలాయించాడు. అతడికి మంచి స్ట్రైక్‌రేట్ ఉంది. ఎక్కువ ఓవర్లు విసిరినా నిలకడ కోల్పోయేవాడు కాదు. భజ్జీని హెడేన్ బాగానే ఎదుర్కొన్నా మిగతా జట్టు విఫలమైంది. అతడే లేకుంటే మేం సిరీస్ గెలిచేవాళ్లం. మాపై అతడికి మెరుగైన రికార్డుంది’ అని స్టీవ్ వా అన్నాడు.
భజ్జీ అందరిలాంటి స్పిన్నర్ కాడని స్టీవ్ వా ప్రశంసించాడు. బౌన్స్‌తోనే వైవిధ్యం ప్రదర్శించేవాడని తెలిపాడు. అతడి బౌలింగ్‌లో తరచూ బ్యాటు, ప్యాడ్‌కు బంతి తగిలి క్యాచ్ ఔట్లు అయ్యేవాళ్లమని పేర్కొన్నాడు. ‘మేమెలాంటి దృక్పథంతో ఆడతామో హర్భజన్ సైతం అలాగే ఆడతాడు. మాలోని స్ఫూర్తి, కసి, పట్టుదల అతడిలో కనిపించేవి. మాతో మేమే ఆడినట్టు ఆడినట్టు అనిపించేది. అందుకే మేం ఔటయ్యేవాళ్లం. అతడి మాట, ఆట, దూకుడు, సానుకూలత అన్నీ ఆసీస్ తరహాలోనే ఉండేవి’ అని అతడు పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
వాహ్ అజహరుద్దీన్.. నువ్వెంతో గ్రేట్: సెహ్వాగ్