
తాజా వార్తలు
నాన్న.. నా హీరో!
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యకు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. వారి త్రండి హిమాంశు శనివారం గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరిత పోస్ట్ చేశాడు. ప్రేమతో తన తండ్రికి సందేశాన్ని ఇస్తున్న ఈ పోస్ట్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
‘‘నాన్న.. నా హీరో!
మిమ్మల్ని కోల్పోవడం నా జీవితంలో అత్యంత కఠినమైన విషయం. కానీ, మాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చారు. మీరెప్పుడూ మా జ్ఞాపకాల్లో నవ్వుతూనే ఉంటారు. మేం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం.. మీరు, మీ శ్రమ, మీ నమ్మకమే. మీరు లేని ఇల్లు ఎంతో బోసిగా ఉంటుంది. మిమ్మల్ని మేం ఎంతో ప్రేమిస్తున్నాం.. ప్రేమిస్తుంటాం. మీ పేరు, ప్రతిష్ఠలను కాపాడుతాం’’
‘‘అయితే నేను ఒక్కటి నమ్ముతున్నా. ఇన్నేళ్లు మా గురించి ఆలోచించినట్లుగానే పైనుంచి కూడా మమ్మల్ని చూస్తుంటారని ఆశిస్తున్నా. మీరంటే మాకు ఎంతో గర్వకారణం. మీ జీవితాన్ని గడిపిన తీరును చూసి గర్వపడుతుంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ప్రతి రోజు మిమ్మల్ని మిస్ అవుతాను. లవ్ యూ డాడీ!’’ అని హార్దిక్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. హార్దిక్, కృనాల్ అంతర్జాతీయ క్రికెటర్లగా ఎదగదడానికి హిమంశు ఎంతో కష్టపడ్డాడు.
ఇదీ చదవండి
ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్