
తాజా వార్తలు
లబుషేన్ శతకం.. వేడ్ ఔట్
గబ్బా: టీమ్ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(101* ; 195 బంతుల్లో 9x4) శతకం సాధించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్(1) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన లబుషేన్.. స్మిత్(36)తో కలిసి మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇక రెండో సెషన్లో స్మిత్ ఔటయ్యాక వేడ్(45; 87 బంతుల్లో 6x4)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ క్రమంలోనే సిరాజ్ వేసిన 63వ ఓవర్ చివరి బంతికి 4 పరుగులు చేసిన లబుషేన్ టెస్టుల్లో 5వ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 50 పరుగుల లోపే అతడు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలుత రహానె క్యాచ్ వదలగా, రెండోసారి పుజారా స్లిప్‌లో అందుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు శతకంతో కదం తొక్కాడు. ఇక నటరాజన్ వేసిన 64వ ఓవర్లో వేడ్ గాల్లోకి షాట్ ఆడడంతో ఠాకుర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 64 ఓవర్లలో 200/4తో నిలిచింది.
ఇవీ చదవండి..