సిడ్నీ టెస్టుకు జట్టును ప్రకటించిన భారత్‌

తాజా వార్తలు

Updated : 06/01/2021 13:16 IST

సిడ్నీ టెస్టుకు జట్టును ప్రకటించిన భారత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సిడ్నీ వేదికగా రేపు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు తుదిజట్టును భారత్ ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. గత మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మయాంక్‌ అగర్వాల్‌ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మరోవైపు గాయంతో ఉమేశ్ యాదవ్‌ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో యువపేసర్‌ నవదీప్‌ సైని జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌తో సైని టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్,ఆసీస్ చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే.

జట్టు వివరాలు
అజింక్య రహానె (కెప్టెన్‌), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్ సైని

ఇదీ చదవండి..

బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన అభిమానికి కరోనా

ఇదే మంచి తరుణంAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని