INDvsENG: ఇక స్టేడియాల్లో సందడే సందడి

తాజా వార్తలు

Updated : 06/07/2021 13:29 IST

INDvsENG: ఇక స్టేడియాల్లో సందడే సందడి

లండన్‌: అభిమానులకు శుభవార్త! భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీసును ఇక పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ఆస్వాదించొచ్చు. పూర్తి సామర్థ్యం మేరకు స్టేడియాల్లోకి అభిమానులకు బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతించింది. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కొవిడ్‌-19 ఆంక్షలను పూర్తి స్థాయిలో ఎత్తేస్తామని ప్రకటించారు. మాస్క్‌లు సైతం ఇష్టం మేరకు ధరించొచ్చని తెలిపారు. జులై 19 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

‘అంతర్గత, బహిరంగ సమావేశాల్లో ప్రజల సంఖ్యపై పరిమితులను ఎత్తేస్తున్నాం. నైట్‌ క్లబ్స్‌ సహా అన్ని వ్యాపారాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నాం. సమావేశ మందిరాలు, థియేటర్లు, క్రీడా స్టేడియాల్లో అభిమానుల ప్రవేశాలపై చట్టపరమైన ఆంక్షలు తొలగిస్తున్నాం. వైరస్‌పై అప్రమత్తంగా ఉంటూనే బయటకు వెళ్లడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు.

ఇంగ్లాండ్‌, భారత్‌ ఐదు టెస్టుల సిరీసు ఆగస్టు 4 నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత ఆటగాళ్లు విరామంలో ఉన్నారు. జులై 14న మళ్లీ దుర్హమ్‌లో ఒక చోట కలుస్తారు. కాగా సౌథాంప్టన్‌ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కేవలం 4000 మంది అభిమానులకు మాత్రమే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంక్షలు తొలగించడంతో ఐదు టెస్టుల సిరీసుకు అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని