లబుషేన్‌ను బోల్తా కొట్టించిన జడేజా

తాజా వార్తలు

Updated : 08/01/2021 06:07 IST

 లబుషేన్‌ను బోల్తా కొట్టించిన జడేజా

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వైపు దూసుకెళ్తున్న లబుషేన్‌ను(91: 196 బంతుల్లో) రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్‌ స్లిప్‌లో రహానెకు చిక్కాడు. దీంతో 100 పరుగుల భాగస్వామ్యానికి జడేజా తెరదించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. స్మిత్‌ (52) అర్ధశతకం చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌, వేడ్‌ ఉన్నారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 166/2తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన లబుషేన్‌ ఔట్‌ కావడంతో భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంది.  

ఇవీ చదవండి..

పంత్‌.. అదే వరస

కుర్రాడు.. అడ్డుపడ్డాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని