Team India: కోహ్లీసేనకు వాక్సినేషన్‌ పూర్తి

తాజా వార్తలు

Published : 13/07/2021 17:13 IST

Team India: కోహ్లీసేనకు వాక్సినేషన్‌ పూర్తి

లండన్‌: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న భారత క్రికెటర్ల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తైందని తెలిసింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకూ టీకా ఇచ్చారు. ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేశారట. శనివారం నుంచి వీరికి టెస్టులు చేయడం మొదలుపెట్టారు. రాబోయే వారాల్లోనూ వరుసగా పరీక్షలు నిర్వహించనున్నారు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌కు వచ్చింది. అక్కడికి బయల్దేరే ముందే క్రికెటర్లకు భారత్‌లో వ్యాక్సిన్‌ వేయించారు. రెండో డోసును బ్రిటన్‌లో వేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫైనల్‌ జరిగాక క్రికెటర్లకు మూడు వారాల విరామం ఇచ్చారు. ఇప్పుడది ముగియడంతో రెండో డోసు టీకా వేశారు.

ప్రస్తుతం ఆటగాళ్లంతా దుర్హమ్‌ చేరుకుంటున్నారు. ఇక అక్కడే శిక్షణ శిబిరంలో ఉండనున్నారు. రెండు బృందాలుగా విడిపోయి సాధన మ్యాచులు ఆడనున్నారు. అంతేకాకుండా కౌంటీ ఎలెవన్‌తోనూ ఓ మ్యాచు ఉంటుంది. దుర్హమ్‌లో క్రికెటర్లు బయో బుడగలో ఉండరని తెలుస్తోంది. భౌతిక దూరం, ఇతరులను కలవకుండా కఠిన సూచనలతో కూడిన బయో రక్షణ వాతావరణంలో ఉంచుతారని సమాచారం.

ఇంగ్లాండ్ క్రికెటర్లు ఈ మధ్య ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నారు. జాతీయ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయ సిబ్బందికి వైరస్‌ రావడంతో జట్టంతా ఐసోలేషన్‌లో ఉంది. దాంతో పాక్‌ సిరీసు కోసం బెన్‌స్టోక్స్‌ సారథ్యంలో మరో జట్టును సిద్ధం చేసి ఆడిస్తున్నారు. ఇక కౌంటీ క్రికెట్లోనూ కేసులు పెరుగుతున్నాయి. డెర్బీషైర్‌, కెంట్‌ కౌంటీ జట్లలో ఒక్కొక్కరికి పాజిటివ్‌ రావడంతో మ్యాచులు రద్దు చేసి ఐసోలేషన్‌కు పంపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని