close

తాజా వార్తలు

Published : 27/11/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీ స్థానం భర్తీ చేయడం కష్టం: రాహుల్‌

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అయితే అతడి పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. తన అవగాహన మేరకు మైదానంలో స్పిన్నర్లకు సలహాలు ఇస్తానని వెల్లడించాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహులే కీపింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఒక వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఉండాలో అతడు మనందరికీ చూపించాడు. అతడి నుంచే మనమెంతో నేర్చుకున్నాం. కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజాతో నాకు మంచి అవగాహన ఉంది. ఏది మంచి లెంగ్తో, ఎక్కడ బంతులు వేయాలో, ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలో నా సామర్థ్యం మేరకు వాళ్లకు సూచనలు చేస్తుంటాను. గ్లోవ్స్‌ ధరించిన ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంటుంది’ అని రాహుల్‌ అన్నాడు.

టీమ్‌ఇండియా తరఫున వికెట్‌ కీపింగ్‌ను తాను ఆస్వాదిస్తున్నానని రాహుల్‌ తెలిపాడు. గతంలో న్యూజిలాండ్‌లో గ్లోవ్స్‌ ధరించానన్నాడు. సారథి, బౌలర్లకు తన అభిప్రాయాలు చెప్పానన్నాడు. ‘కివీస్‌ పర్యటనలో నేను గ్లోవ్స్‌ ధరించాను. కీపింగ్‌ను ఆస్వాదించాను. వికెట్ల వెనకాల ఉంటూ మ్యాచ్‌ను అర్థం చేసుకొని కోహ్లీ, బౌలర్లకు సలహాలు ఇచ్చాను’ అని వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన