close

తాజా వార్తలు

Published : 03/03/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంగ్లాండ్‌కు ఇంకా అవకాశముంది 

మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ జట్టుకు అవకాశాలు మూసుకుపోలేదని.. నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ డ్రా చేసుకోవచ్చని ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. తాజాగా ఓ ఆన్‌లైన్‌లో బ్లాగ్‌లో అతడీ విషయాలను పంచుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులోనూ పిచ్‌లో పెద్దగా మార్పులుండవని చెప్పాడు. కాగా, మొతేరాలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీటర్సన్‌ ఆ వ్యాఖ్యలు చేశాడు.

‘తర్వాతి మ్యాచ్‌లో పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బాగా బ్యాటింగ్‌ చేస్తే.. పరిస్థితుల్ని ఆధీనంలోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. భారత్‌లో వైఫల్యానికి ఇంగ్లాండ్‌ యువ బ్యాట్స్‌మెన్‌ను నిందించడం లేము. ఎందుకంటే వారికిది తొలి పర్యటన. ఇదో అనుభవం వలే ఉంటుంది. ఇప్పటికే ఓడిపోయిన మ్యాచ్‌ల గురించి ఆందోళన చెందకుండా, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడంపై  ప్రశాంతంగా ఆలోచించాలి. ఇంతకన్నా బాగా ఆడాలేనా?మెరుగవ్వాలంటే ఇంకేం చేయాలనే విషయాలపై దృష్టిసారించాలి’ అని పీటర్సన్‌ వారికి సూచించాడు.

కాగా, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 277 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాక రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆపై పింక్‌బాల్‌ టెస్టులోనూ పది వికెట్లతో ఘన విజయం సాధించి పర్యాటక జట్టును కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ఆ జట్టు ఎలా ఆడనుందో వేచి చూడాలి. ఇక భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిచినా, డ్రా చేసుకున్నా జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్‌ గెలిస్తే ఆస్ట్రేలియా ఆ పోటీకి అర్హత సాధిస్తుంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని